అంబేద్కర్ 67వ వర్ధంతి
డిసెంబర్ 6
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండల్ సందర్భంగా ఎర్రవల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు,బిజెపి గజ్వేల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ ఆకారం అశోక్ మాట్లాడుతూ,భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేడ్కర్ తన భుజస్కందాలపై మోశారు. కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోగా. మిగతా ఐదుగురు వేర్వేరు కారణాలతో అంతగా శ్రమించకపోయినా.
అంబేడ్కర్ ఒక్కరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా ఇలా అంబేడ్కర్ గురించి ఎంత చెప్పుకునా తక్కువేననడంలో అతిశయోక్తి లేదు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించారు అని తెలిపారు, అంబేద్కర్ ఆశలను గుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు
