హైదరాబాద్, సెప్టెంబర్ 14:రాష్ట్రంలోని జిల్లాల మహిళా సమాఖ్యల పదాధికారుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు.
మహిళా లోకాన్ని చైతన్య పరచండి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. మహిళల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మన సీఎం కెసిఆర్ పని చేస్తున్నారు. ఆయనకు అండగా నిలవండి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జిల్లాల మహిళా సమాఖ్యల పదాధికారుల సమావేశంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని టిఎస్ ఐఆర్ డి లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాల సమాఖ్యల పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందనలు. సిఎం కెసిఆర్ వచ్చాకే, రాష్ట్రంలో మహిళా సంఘాలు బలోపేతం అయ్యాయి. మన మహిళలు దేశంలోని మహిళలందరికంటే ముందు న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందున్నాం. మన మహిళలు దేశానికి పాఠాలు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా మన రాష్ట్రం తరహా అభివృద్ధి లేదు. ఇలాంటి పథకాలు లేవు. ఇంతగా మన కోసం పని చేస్తున్న సీఎం కెసిఆర్ కు అండగా నిలవాలని మంత్రి మహిళలకు పిలుపునిచ్చారు. వారిని చైతన్య పరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సె ర్ఫ్ సీఈవో గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్ బి ఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, వివిధ జిల్లాల సమాఖ్యల పదాధికార మహిళలు తదితరులు పాల్గొన్నారు.




