పొంచి ఉన్న ప్రమాదం. పట్టింపులు లేని అధికారులు
డిసెంబర్ 6
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని ఊరడమ్మ దేవస్థానం ముందు ప్రధాన చౌరస్తా మూల మలుపుల దగ్గర గత కొన్ని రోజుల కితం డ్రైనేజ్ ఓపెన్ చేయడం జరిగిందని ఇప్పటివరకు తగిన మరమ్మతులు చేపట్టక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంబంధిత అధికారుల్లో స్పందన కరువైంది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరడమ్మ మైసమ్మ దేవస్థానం కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అటువైపు వెళితే ప్రమాదం తప్పదని గ్రామ సర్పంచ్ సౌమ్య గ్రామపంచాయతీ సెక్రటరీ సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
