ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు కి మంత్రి పదవి ఇవ్వాలి
డిసెంబర్ 6 మద్నూర్
కామారెడ్డి జిల్లాలోని, మద్నూర్ మండల కేంద్రంలో ,కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మేనూర్ సర్పంచ్ విట్టల్ గురూజీ, మాట్లాడుతూ ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సాహెబ్ రావు, కొండ గంగాధర్, రామ్ పటేల్ తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





