ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల కళను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి.
మంచిర్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నో ఎండ్ల మాదిగల కళను నిజం చేసిన నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాత్రమే అని అన్నారు. దళితుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా మరియు దళితు బందు తో దళితులకు 10 లక్షల రూపాయలు అందిస్తామని దళితులను మోసం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దళితుల కోసం మరిన్ని సంక్షేమ పథకాల అమలు చేస్తామని తెలిపారు.
