పేదల కోసం
బిజేపి అద్భుతమైన మేనిఫెస్టో
గజ్వేల్ నుండి ఈటల రాజేందర్ విజయం తథ్యం
బిజేపి ఎన్నికల ఇన్చార్జి సింగం సత్తయ్య
నవంబర్ 19
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గo అట్టడుగున నిలిచిన పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించినట్లు బిజేపి ఎన్నికల ఇన్చార్జి సింగం సత్తయ్య , బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కోడలు క్షమిత పేర్కొన్నారు . బావానంద పూర్ లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు .
ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ నుండి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని , అలాగే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత తమపై ఉన్నట్లు స్పష్టం చేశారు . సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధులు , నీళ్లు , ఉద్యోగ నియామకాల ఆకాంక్ష నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు . కరోనా కష్టకాలంలో ఉచితంగా రేషన్ అందించిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందని చెప్పారు . ప్రాజెక్టుల నిర్మాణం పేరిట నిధులన్నీ కెసిఆర్ కుటుంబానికి చేరగా , ఎన్నికల అనంతరం కేంద్రo దర్యాప్తు చేపడుతుందని అన్నారు .
ఆయితే గత 9 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ 215 లక్షల కోట్లు వివిధ అభివృద్ధి పనులకు కేటాయించగా, మిగులు నిధులతో తెలంగాణ ఏర్పడగా , ప్రస్తుతం రూ 6 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు . అక్రమాల ధరణి స్థానంలో భూమి యాప్ పేరిట రైతులందరికీ న్యాయం చేయనున్నట్లు చెప్పారు . అలాగే డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందించనున్నట్లు చెప్పారు .
పెట్రోలు , డీజిల్ పై వ్యాట్ పన్ను తగ్గించడంతోపాటు రైతు పండించిన వరి రూ 3100 కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు . ఎరువులు , విత్తనాల కొనుగోలుకు రూ 2500 ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేయనుండగా , ఫసల్ బీమా పథకం కింద ఉచితంగా పంటలకు భీమా చేయనున్నట్లు తెలిపారు . అలాగే పాడిని ప్రోత్సహించే క్రమంలో ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీయ ఆవులను పంపిణీ చేయనుండగా , అన్ని వర్గాల సంక్షేమమే బిజెపి లక్ష్యమని అన్నారు .
తమ అభ్యర్థి ఈటల రాజేందర్ పై దుష్ప్రచారం చేస్తున్న మంత్రి హరీష్ రావుకు ప్రజలే గుణపాఠం చెబుతారని , ఎవరెన్ని కుట్రలు పన్నినా బిజెపి గెలుపును ఆపలేరని వివరించారు . ఈ కార్యక్రమంలో నేతలు రమేష్ గుప్త , తిరుపతిరెడ్డి , రాజేందర్ సింగ్ , మర్కు ఎంపీటీసీ శంకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రామిరెడ్డి, కాశిరెడ్డిపల్లి సర్పంచ్ అప్పల మల్లేష్ ,మల్లేష్ , నర్సింలు , శ్రీకాంత్ రెడ్డి , మహేందర్ , సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కట్ట భాగ్యలక్ష్మి , చంద్రశేఖర్ , దాసు, శ్రీకాంత్ ,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు .
