ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల యువకులు బాగా ఆకర్షితం అవుతున్నారని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు చదువులో కూడా వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చదువు కూడా భారంగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొమ్మాటి రాజు నాయకులు జెల్ల రవి గణేష్ సురేష్ పాల్గొన్నారు
