సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా అక్క పెళ్లి లో భారీగా ముదిరాజులు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు.
అక్క పెళ్లి కి చెందిన ముదిరాజ్ కులస్తులు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ అధ్యక్షులు భూమిరెడ్డి , డాక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సుడిది రాజేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
