Breaking News ప్రకటనలు రాజకీయం

బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన….

164 Views

బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన…
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలన చేశారు,
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80 లక్షల రూపాయలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు,అట్టి నిధులతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ నిర్మాణం చేస్తున్నారు,
పురాతన ఆలయంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారిని నూతన ఆలయ నిర్మాణం పూర్తియ్యే వరకు పశువుల సంతలో ఉన్న ఖాళీ స్థలంలో బాలాలయం నిర్మించి అందులో స్వామివారికి నిత్య పూజలు ఆలయ పూజారి నవీన్ చారి ఆధ్వర్యంలో అందించాలని గ్రామస్తులు గ్రామ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు ,అందులో భాగంగా సోమవారం బాలాలయ నిర్మాణం కోసం గ్రామస్తులు గ్రామ ప్రజాప్రతినిధులు స్థల పరిశీల చేశారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బ్రహ్మశ్రీ రాచర్ల రఘురాం శర్మ ,ఆలయ పూజారి బిట్కూరి నవీన్ చారి ,ఎంపీటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి, ఆలయ కమిటీ చైర్మన్ నందికిషన్, కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల పల్లకి ప్రభాకర్ రెడ్డి, మెగి నర్సయ్య,, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎలగందుల నరసింహులు , చందనం శివా రాం కృష్ణ, ఎడ్ల సందీప్, బొల్లు భూమయ్య యాదవ్, కిషన్, శ్రీ నివాస్, బాల్ రెడ్డి, దేవయ్య , బాబు , రాజయ్య , తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *