మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నేడు మంచిర్యాల పట్టణంలోని వివిధ వార్డుల నుండి టిఆర్ఎస్ నాయకులు.. మరియు కుల సంఘ నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సినీ కార్మిక సంఘం అధ్యక్షులు పొలసాని సత్యనారాయణ రావు, టిఆర్ఎస్ నాయకులు నడిపెల్లి శ్రీనివాసరావు , పద్మశాలి జిల్లా కోశాధికారి నల్ల దేవేందర్ ,జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మట్టెల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటోజు రమేష్, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుల మహేష్ మరియు వివిధ వార్డు సభ్యులందరూ కలిసి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
వీరందరికీ మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
