రాజకీయం

మూడోసారి గెలిపించండి….

88 Views

వర్గల్ మండల్ నవంబర్ 15 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సామలపల్లి, నెంటూరు, జబ్బాపూర్ గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ కానీ రైతు భీమా గాని రైతు బంధువు గాని గొర్రెల పంపిణి గాని ముదిరాజుల చెరువుల చేపల సంపద గురించి మరి ఎన్నో పథకాల గురించి చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలు చాలా సంతోషంగా వారు కూడా సీఎం కేసీఆర్కి ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తామనిచెప్పారు.

మన కళ్ళ ముందే జరిగిన అభివృధ్ది కనిపిస్తుంటే వేరే పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అభివృద్దిని కాంక్షించే ప్రభుత్వం మనకు మేలు చేసే ప్రభుత్వం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం, దాచుకోవడం, మోసం చేసే పార్టీ అని ద్వజమెత్తారు.

ఎలక్షన్స్ వచ్చే సరికి అన్ని అబద్ధాలు,అసత్యాలు చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ చూస్తారని వారు ఆరోపించారు.

ఎవ్వరు మరువ వద్దని ఓటు వేసే ముందు ఒక్కసారి సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న మన ప్రభుత్వానికి కేసీఆర్ కారు గుర్తుకే ఓటు వేయాలని అన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *