ప్రాంతీయం

బీసీలకు బీసీబందు 10లక్షలు కేటాయించాలి…

125 Views

ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల పట్టణంలో విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రభుత్వం వెంటనే బీసీ బందు పథకాన్ని ప్రకటించాలని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు ఇవ్వలేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డు కాలమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందును పథకాన్ని ప్రకటించాలని అన్నారు బీసీలకు మొండి చేయి చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలను అణచివేసే దిశగా రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా వారిని ఆర్థికంగా దెబ్బతీస్తుందని అన్నారు తక్షణమే బీసీ బందు ప్రకటించకపోతే రాబోయే ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో బీసీలు చూపించిన తెగువ స్ఫూర్తితో ఆర్థికంగా రాజకీయ రంగాలలో చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 8 ఏళ్లు కావస్తున్న నేటికీ బీసీల జీవన విధానంలో ఆర్థిక స్థితిగతులలో మార్పు రాలేదన్నారు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆరోపించారు. ఈసమావేశంలో  బీసీ విద్యార్థి సంఘం డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షుడు మట్ట నరేష్, నాయకులు దోరగొల్ల వినీత్, దుబ్బాక అజయ్ కుమార్, బత్తిని రోహిత్ తదితరులు పాల్గొన్నామని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్