ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 26
తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి రాజు అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం నిజం దొరకను ఎదిరించి దొరల గడియలను గడగడ లాడించిన తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పేరును రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని తెలిపారు.
కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఐలమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేగాక ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తూ.. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమీషన్ లో సభ్యురాలిగా నియమిస్తామని చెప్పడం సంతోషకరమైన విషయం అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ రజాకా అధ్యక్షులు వరిమడ్ల బిక్షపతి బాల్ నర్సయ్య శేఖర్ రమేష్ హరీష్ వివిధ పార్టీ నాయకులు పానుగంటి రాజు జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మణ్, రాజు లింగం తదితరులు పాల్గొన్నారు.





