ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్4, (24/7) తెలుగు న్యూస్, ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో సీజ్ , నవంబర్ కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న15 కేజీ ల పటిక బెల్లంను పోలీసులు శనివారం సాయంత్రం గంభిరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద పట్టుకున్నారు. పటిక బెల్లం ఎవరిదో బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్పకపోవడంతో దానిని చెక్ పోస్ట్ వద్దకు తెచ్చారు. ఆవిషయాన్ని పోలీస్ లు అప్పటికే అక్కడ ఉన్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి తెలియజేశారు. వ్యయ పరిశీలకుల సూచనలతో పట్టుకున్న బెల్లంను సీజ్ చేశారు. ఈ సమాచారం పౌర సరఫరాల అధికారి తెలిపారు.
