ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్4, (24/7): మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ఇటు వ్యవసాయ క్షేత్రంలో కలిసి 6,గ్యారంటీలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ కేటీఆర్ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ మీదపడి ఏడవడంమె తప్ప వేరొక పని లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పింఛన్ రాదు రైతుబంధు రాదు కరెంటు ఉండదు రుణమాఫీ కాదు అంటూ ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించాలని పన్నాగం పన్నారని ఆరోపించారు. కానీ కెసిఆర్ కేటీఆర్ దేశంలో మొట్టమొదట 9,గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అమలుపరిచినదే కాంగ్రెస్ పార్టీ ఒకేఒక సంతకంతో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 24, గంటల కరెంటు ఇస్తున్నానని అంటున్న మాట నిజమే అయితే 24, గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నాదో నిరూపించగలరా.. దీనికి మీరు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నాయకులు సవాలిసురుతూ అమలు చేశాను మండిపడ్డారు. 2018లో అమలు చేశామంటున్నా రుణమాఫీ ఇంతవరకు చేపట్టలేదు ఎలక్షన్ కమిషన్ అవకాశమిస్తే ఇప్పుడు చేస్తాము అని మీరే కదా అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న రుణమాఫీ చేయలేని బి.ఆర్.ఎస్ పార్టీకీ ఓడిపోతామన్న భయం పట్టుకొని అణువణువునా పీడిస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీపై రాళ్లు విసిరేస్తున్నారన్నారు. నాడు కెసిఆర్ మొదటగా మాట్లాడిన మాటలు దళితుని సీఎం చేస్తానన్నాడు, దళితునికి మూడెకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు అవన్నీ తుంగలో తొక్కేసి నేడు అవ్వ పింఛన్ వస్తుందా, అవ్వ ఇంటికి నల్లా వస్తుందా, అవ్వ బతుకమ్మ చీర వచ్చిందాని మభ్యపెట్టుకుంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ కొత్త పథకాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేద్దామని అనుకుంటే ఈనాడు ప్రజలు నమ్మే విధంగా లేరని తెలిసిపోయిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో బిఆర్ఎస్ ప్రచారం చేస్తున్న వాహనాన్ని అడ్డుకట్ట వేస్తున్నారని ఓవైపు అభిమన్యుని పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు భయం పట్టుకున్న కేటీఆర్ కు కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. 9,ఏళ్ల పాలనలో ప్రజలు దీన్ని నిశితంగా గమనిస్తున్నారని మాఓటుతో సమాధానం చెబుతామని ఓపికతో ఉన్నారన్నారు.
ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, చికోడు గ్రామశాఖ అధ్యక్షులు బుగ్గ రమేష్, ఫ్యాక్స్ డైరెక్టర్ కరెడ్ల కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
