*ఇంటికో ఉద్యోగం మూడు ఎకరాల భూమి జాడ ఎక్కడ*
*నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు
* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తాం
* అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం
*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన ఇంటికో ఉద్యోగం, మూడెకరాల జాడ ఎక్కడ అని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని చౌదరి పాలెం, చిన్న మాసాన్ పల్లి, మంతూర్ గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడంలో అధికార పార్టీ ముందంజలో ఉన్నదని ఆయన అన్నారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు మాత్రమే నిధులను 9 సంవత్సరాలుగా మళ్లించడం జరిగిందన్నారు. మరోసారి అధికారంలోనికి రావడం కోసం సర్పంచులను, ఎంపీటీసీలను డబ్బులతో కొనుగోలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలను మోసం చేయాలని ఎత్తుగడలు వేస్తున్న పార్టీలకు ఈనెల 30న జరిగే ఎన్నికలలో ఓటు ద్వారా సమాధానం చెప్పాలన్నారు. దుబ్బాక ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే స్వర్గీయ మాజీ మంత్రి ముఖ్యం రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలోనే విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల కళాశాల భవనాలు ఆస్పత్రిలో మహిళా కమిటీ భవనాలు మురికి కాలువ నిర్మాణం చేయటం జరిగిందని ఆయన గుర్తు చేశారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల అభివృద్ధి మాదిరిగా దుబ్బాక కు ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న భూములన్నిటిని అమ్మడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ మూడు సంవత్సరలో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎడ్లు నాగలి ఎక్కడ ఇచ్చారు అని అన్నారు. మనం ఓట్లు వేస్తే మన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్ని అమ్మడం ఖాయమన్నారు. మనందరం చైతన్యమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మ్యానిఫెస్టో పెట్టిన ఆరింటిని అమలు పరచడం ఖాయమన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇంతకాలం వాళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి తొమ్మిది సంవత్సరాలుగా అభివృద్ధికి దూరమయ్యామని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్ సిద్దిపేట, సిరిసిల్ల నియోజవర్గాలకు ఎన్ని నిధులు కేటాయించారు. అదే మాదిరిగా మన దుబ్బాక కు ఎన్ని నిధులు కేటాయించారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఆయన ప్రశ్నించారు. అనంతరం చిన్న మాసానన్ పల్లి గ్రామంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో 20 మంది గ్రామస్తులు చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య అధికార ప్రతినిధి కృష్ణ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేకుల పెద్ద లక్ష్మారెడ్డి, దౌల్తాబాద్ అధ్యక్షులు పడల రాములు కృష్ణారెడ్డి రాయపోల్ మండల మాజీ అధ్యక్షులు బాగన్న గారి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్ప మల్లేశం, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దయాకర్, దుర్గాప్రసాద్, మంద కర్ణాకర్, కృష్ణ, రాచకొండ కర్ణాకర్, ప్రవీణ్, సురేష్, బాలకృష్ణ, సమరి విజ్ఞాన్ ఈదేశ్ వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.