రామగుండం పోలీస్ కమిషనరేట్
తెలంగాణ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్, ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ శ్రీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఐపిఎస్., అధ్వర్యంలో ఈరోజు అనగా తేది 03-11-2023 మందమర్రి సర్కిల్ కార్యాలయము ఆవరణలో మందమర్రి మరియు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఇది వరకు వేర్వేరు కేసులలో ఉన్న సస్పెక్ట్, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఎక్కడైనా గొడవలకు దిగితే ఉపేక్షించేది లేదని, నేరప్రవృత్తి వీడి మంచి ప్రవర్తనతో కుటుంబాలతో కలిసి జీవించాలన్నారు.
నేర ప్రవృత్తి వీడకపోతే పీడీ యాక్టు తప్పదని డీసీపీ గారు హెచ్చరించారు. ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అన్నారు. అనవసరమైన గొడవలకు, కొట్లాటల జోలికి పోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వారిని హెచ్చరించారు.
రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడకుండా సత్ప్రవర్తన తో మెలగాలని వారికి సూచిస్తూ ముందస్తు చర్యలలో భాగంగా వారిని తహసీల్దార్, మందమర్రి ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగినది.
ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, మందమర్రి ఎస్ఐ చంద్ర కుమార్, హరీశేఖర్,రామకృష్ణ పూర్ ఎస్ఐ రాజశేఖర్, పాల్గొన్నారు.






