ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్4, (24/7) చిప్పుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన కల్వకుంట్ల తారరామారావుని భారీ మెజార్టీతో గెలిపించాలని మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటా ప్రచారం చేస్తున్న ఇన్చార్జీలు. చిప్పులపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్లు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, పార్టీ నాయకులు, తాడెపు ఎల్లం, గాడిచెర్ల దేవయ్య, కొమ్మటి రాజమల్లు, మచేటి లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు కంచర్ల రాజ లింగము గౌడ్, చిప్పలపల్లి పార్టీ నాయకులు, యువకలు తదితరులు పాల్గొన్నారు.
