తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు.
