Breaking News రాజకీయం

ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం

110 Views

ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం

నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 2కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత

ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహణ పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి హాజరుకానున్న ప్రజలు, గ్రామ సర్పంచులు

ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల లోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్న గ్రామ సర్పంచులు, ప్రజలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కుందం – సీఎం కేసీఆర్

దక్షిణ తెలంగాణ కు పండుగ రోజు – సిఎం కేసీఆర్ ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషి తో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైంది – సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి – సీఎం

పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు – సీఎం

పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు,
సాగునీరు అందనున్నది.

బంగారి తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నది. – సీఎం కేసీఆర్

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *