రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రైతు అప్పుల బాధ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని బదనకల్ గ్రామానికి చెందిన చింతాల యాదగిరి అనే రైతు అప్పు సప్పుచేసి మొక్కజొన్న పంటను పండించుకుంటున్నాడు.
అయితే ఇటీవల కోతుల ఎక్కువై పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని ఎలా తీర్చాలో అనే బాధతో గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు.
