రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన పంతులు గారి రేణుక భూమిలోకి అక్రమంగా చొరబడిన ముగ్గురుపై కేసు నమోదు చేసామని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన పంతులు గారి రేణుక వ్యవసాయ భూమిలోకి అదే గ్రామానికి చెందిన ఉప్పుల రవి,బోనాల మనవ్వ,బోనాల సాయి లు అనే ముగ్గురు గురువారం మధ్యాహ్నం అక్రమంగా భూమి లోకి చొరబడి వరి పంటను కోశారు. ఇదేంటి అని రేణుక అడ్డుకోగా వారి కుటుంబ సభ్యులను నానా బూతులు తిడుతూ చితకబాదారు అని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై ముగ్గురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.
