రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యుల విరాళా ప్రకారం రంగంపేట గ్రామానికి చెందిన భూక్య మోహన్ (43) అనే వ్యక్తి కంచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.
గురువారం రోజు యధావిధిగా పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉదయాన్నే లేచి ఏడు గంటలకు బాత్రూంలో స్నానానికి వెళ్లి గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికలు మిన్నంటాయి. మృతునికి భార్య అమృత, కుమారులు హరిచంద్ర, భాను ప్రసాద్ లు ఉన్నారు.




