నిప్పుతో చెలగాటం…
ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు..
ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని వీక్షకులు కంగు తింటున్నారు.
