*
జనం న్యూస్ అక్టోబర్ 22 గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ (రిపోర్టర్ స్వామి)
గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్టమీద డిజైన్ లైట్లు కలర్ కలర్ ఆయన వేయించారు.తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ ను రంగ రంగ వైభవంగా జరిపారు, సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానికి అంటాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరు కలిసి తీరొక్క రంగు రంగుల పూలతో బతుకమ్మ ను ఒక్కో రకం పూలతో ఒక్కొక్క చుట్టును పేరుస్తూ భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో బతుకమ్మ ను తయారు చేసి ఆ బతుకమ్మ ను దైవంగా కొలుస్తారు. సాయంత్రం వేల గ్రామం లోని వాడ వాడ మహిళలు అందరూ వారు తయారు చేసిన బతుకమ్మ లను ఒక్కదగ్గరికి తీసుకువచ్చి ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు .
అలాగె చిన్నారులు పాటలు పెట్టుకుని కోలాటాలు ఆడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఆట పాటలు ముగిసిన తరువాత ఆ బతుకమ్మ లను గంగమ్మ ఒడిలోకి చేర్చడం జరిగింది. ఆ తరువాత వారు తీసుకొచ్చిన సద్దులను పెద్ద చెరువు కట్ట పైన కూచొని అందరూ వాటిని తిని తిరిగి వచ్చి ఇండ్లకు చేరుకున్నారు..