ప్రైవేటు టీచర్స్ మరియు లెక్చరర్స్ మహోదయుల్లారా
40 వేల కంటే తక్కువ జీతం ఇస్తే పనిచేయకండి
గురువృత్తిని గురుజీతాలను లేబర్స్ కన్న తక్కువగా దిగజార్చకండి
40 వేలజీతమే ముద్దు లేకపొతే ఈ టీచింగ్ ఫీల్డ్ వద్దు
మీ జీవితాలను ఆగం ఆగం చేసుకోకండి
యౌవ్వనం ఉన్నప్పుడే మంచి ఉద్యోగం పొంది సంపాదించుకొండి జీవితంలో స్థిరపడండి
వృద్ధాప్యంలో సుఖపడండి
ఉద్యోగభద్రత ఉండదు
రోగం వస్తే కనికరం లేకుండా నిన్ను తీసేస్తారు
అన్ని పథకాలు ఓట్లకోసం పెడతారు ఆదుకుంటారు
ప్రైవేటు గురువులకు ఏ పథకం ఉండదు
గురువులలో ఐకమత్యం ఉండదు నిన్ను తొలగిస్తే సాటిగురువులు నీకు సహకరించరు
నీవు బానిసకన్న హీనంగా పనిచేయాలి
గురువులు మానవత్వంగురించి గొప్ప స్పీచిలు ఇస్తారు సాటి గురువును అన్యాయంగా తొలగిస్తే ఎవ్వరు పట్టించుకోరు
ప్రైవేటు గురువుల జీతాలు అధమం నీచం నికృష్టం అని ఎవ్వరూ ప్రశ్నించరు
ప్రైవేటు గురువృత్తిలోకి వస్తే మీరు జీవితమంతా మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి
మూడుమూటల తిండికి కూడ కష్టం అవుతుంది
ఇల్లు కొనడాలు పెండ్లిల్లకు పోవడాలు ఇవన్ని స్వప్నాలు మాత్రమే
ఈ రాజకీయ నాయకులకు ప్రైవేటు గురువులమీద కనికరం ఉండదు
ప్రశ్నించే గురువును తొలగిస్తే సాటి గురువే పట్టించుకోడు
ఐకమత్యం కరుణ లేని ఈ టీచింగ్ ఫీల్డ్ లోకి రాకండి
ఓ యువతరమా మీ జీవితాలను కష్టాలమయం చేసుకోకండి
పిల్లలతో
అరచి అరచి అరచి అరచి వ్రాసి వ్రాసి గురువుల జీవితాలు టపాకాయలవలే తొందరగా పేలిపోతాయి
టీచర్స్ అంటే యూస్ ఎండ్ త్రో పెన్ లాంటి వారు రక్తం ఉన్నంతవరకు వాడుకుంటారు తరువాత చెత్తబుట్టలో పారేస్తారు
ఒక్క సారి ఈ ఫీల్డుకు అలవాటైతే ఇంక బానిసబ్రతుకే
నా మాట వినండి
40 వేల జీతం ఇస్తేనే టీచింగ్ ఫీల్డులోకి రండి
మీ జీవితాలను కాపాడుకొండి
యౌవ్వనం లో తక్కువ జీతంతో పనిచేస్తే జీవితాంతం నరకం చూడక తప్పదు
ఈ ప్రైవేటు టీచింగ్ ఫీల్డులో గురువులను యూస్ ఎండ్ త్రో గా వాడుకొని వదిలేస్తున్నారు
గురు వృత్తిలోకి వస్తే నరకమే ఉంటుంది
ప్రైవేటు
మాఫియా విద్యారంగంలో గురువులు బలైపోతున్నారు
నీవు పూజారివి అయితే ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పేరుతో నీవు బ్రతకడానికి ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది
నీవు మౌలానా అయితే ఈ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పేరుతో నీవు బ్రతకడానికి ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది
నీవు ఫాదర్ అయితే ఈ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పేరుతో నీవు బ్రతకడానికి ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది
నీవు ప్రైవేటు గురువు అయితే నిన్ను ప్రభుత్వం గుర్తించదు పనికి రాని బానిసగా చూస్తుంది
ప్రైవేటు గురువువు అయితే నీకు జీవితంలో పెండ్లికూడ కాదు
ఈ ప్రభుత్వంలో సమాజంలో గుర్తింపు లేని ప్రైవేటు గురు వృత్తిలోకి వస్తే
నీ భవిష్యత్తు కాదు కాదు
నీ వర్తమానం కూడా
అంధకారమే
ప్రైవేటు
గురువుల కష్టాలను తీర్చలేని నేతలున్నారు
ఈ ప్రైవేటు గురువుత్తిలోకి రావడం అవసరమా
ఆలోచించండి
ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక సీనియర్ గురువుగా నీకు గౌరవం ఉండదు
నిన్ను తొలగించి వేరే వారిని నియమించుకుంటారు
కనికరం ఉండదు
10 నెలలు 11 నెలల జీతం ఇచ్చే వృత్తి ఇది
గెస్ట్ ఫ్యాకల్టీ గురువులు
ఓట్ సోర్సింగ్ ఫ్యాకల్టీ గురువులు
పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ గురువులు
రెటైర్డ్ ఫ్యాకల్టీ గురువులు