ఇంటర్ కళాశాల అడ్మిషన్ల దందాపై చర్యలు చేపట్టాలి
అజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు
కరీంనగర్ జిల్లా మార్చి 31
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు చేస్తున్న అడ్మిషన్ల దందా పైన వెంటనె చర్యలు చేపట్టాలని ఏబీవీపీవిభాగ్ కన్వీనర్ అజయ్ అన్నారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ నూతన విద్యాసంవత్సరానికి మరో రెండున్నర నెలలు సమయం ఉన్న అప్పటికి పేరొందిన కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే 90 శాతం కి పైగా అడ్మిషన్ల పూర్తిచేసి, అడ్మిషన్ ఫీ పేరు మీద 20,000 వరకు వసూల్ చేసారు, అక్రమంగా అడ్మిషన్ ఫీ వసూల్ చేస్తున్న కళాశాలలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు వత్తాసు పలకడం శోచనీయం .ఇంటర్ బోర్డ్ అధికారులు విద్యార్థుల కోసం కాకుండా , కళాశాలల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయారని అన్నారు. ఒకే బ్రాండ్ పేరు మీద వందలాది కలశాలలు పెట్టి విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షల ఫిజులు వసూలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. కావున ఇప్పటికైనా అక్రమంగా అడ్మిషన్ల ను చేసిన ఇంటర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి . ఈ ఏడాది ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేసారు.





