Breaking News

మోక్షగుండంను యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలి

69 Views


గూడూరు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు ఈరోజు ఇంజనీర్స్ డే లయన్స్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. సదరు సభకు లైన్స్ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి రవీంద్ర బాబు మాట్లాడుతూ యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను ఆదర్శంగా తీసుకొని తమ ప్రతిభతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని కోరుచూ విశ్వేశ్వరయ్య గారి గురించి విసిదీకరించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్తార్ హుస్సేన్ మాట్లాడుతూ మోక్షగుండం దేశానికి ఎనలేని సేవ చేశారని ఆ సేవను గుర్తించి భారతదేశ అత్యున్నత పునస్కారం భారతరత్న వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. పంచాయతీరాజ్ డిప్లమాంజనేయ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి క్రమశిక్షణను అలవర్చుకొని తమ తమ నైపుణ్యాల గ్రామ అభివృద్ధికై వినియోగించి రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేటట్లు చూడాలన్నారు గూడూరు ఎలక్ట్రిసిటీ డిప్యూటీ ఇంజనీర్ ఎల్. ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంకనూ ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు మల్లెమాల మురళి రెడ్డి వాకాటి రామ్మోహన్ బ్రహ్మదేవి సీనయ్య మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి మరియు లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమం అనంతరం పంచాయతీ రాజ్ ఈ ఈ డి రవీంద్రబాబు, ఆర్డబ్ల్యూ ఎస్ ఈ ఈ సత్తార్ హుస్సేన్ ఎలక్ట్రిసిటీ డి ఈ ఈ ఎల్. ప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ డి ఈ ఈ నందకుమార్ పంచాయతీ రాజ్ రామయ్య పంచాయతీరాజ్ జేఈ కిరణ్ మరియు ఎలక్ట్రిసిటీ ఏ ఈ ముని కుమార్ మరియు సచివాలయాల్లో ప్రతిభ కనబరిచిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు యు. సాయికుమార్ ఇంకా, కె. నరేష్, డి. అనిల్, షేక్ ఆరిఫాలను లయన్స్ క్లబ్ తరఫున ఘనంగా సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్ మెంబర్లు మదనమేటి రమణయ్య, డాక్టర్ చంద్రహాస్, అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి,, రూపేష్ రెడ్డి క్లబ్ సెక్రటరీ శివయ్య ట్రెజరర్ వీరేంద్రనాథ్ మరియు కళ్యాణ సాయి పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సైదాపురం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లయన్ వి దయా కర్ దాతృత్వంతో నిర్వహించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్