మంచిర్యాల జిల్లా
మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ మైదానంలో వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సందేల వెంకటేష్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ వాకర్ క్లబ్ సభ్యులు జగన్, వీర శంకర్ ,సాగర్ యాదవ్, మహేష్, సురేందర్, రాజిరెడ్డి, రవి, మార్కండేయ, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జాఫర్, ముంజం సత్యనారాయణ, పున్నం తదితరులు పాల్గొన్నారు.
