ముస్తాబాద్, ప్రతినిధి జూలై6, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో గల బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జిల్లా కోఆప్షన్ సర్వర్ ఫాషా జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండలంలోని పలు గ్రామాల నుండి పార్టీ నాయకులు పాత్రికేయులు బిఆర్ఎస్ ఆఫీసులో వీరందరీ సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వర్ ఫాష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, మిత్రులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, బిఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మేరుగు యాదగిరి గౌడ్, అన్వర్, శీలంస్వామి, వార్డ్ మెంబర్ సత్యం, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




