ముస్తాబాద్, ప్రతినిధి జూలై10, మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాత నేరెళ్ల నియోజకవర్గంలో ప్రతిగడపగడపకు తెలంగాణ వాదాన్ని చాటిన గొప్పవ్యక్తి కేకే అన్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు, మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లకు పైచిలుకు ఉంటూ ప్రజలకు సేవాచేసేభాగ్యం కల్పించాలని కోరుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ముస్తాబాద్ ఎంపీటీసీలు గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక రాజు స్వేచ్ఛ, నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గన్నె భాను, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు సడిమెల బాలయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, పట్టణ అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి, మెరుగు శివ
గౌడ్, తాడేపు శ్రీనివాస్, దికొండ దశరథం, శ్రావణ్, వంశీ, రాజేందర్, బన్నీ, సందీప్, ప్రవీణ్, నారోజు భాను, యశ్వంత్, కళ్యాణ్ ప్రశాంత్, మధు, కార్తీక్, వంశీ, మారుతి, తరుణ్, నవీన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.




