- *మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం*
మెడిసిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిర నీ
రాయపోల్ మండల పరిధిలోని రామారాం గ్రామంలో గ్రామ సర్పంచ్ సరోజినీ హనుమంతు, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటుచెవి,ముక్కు,గొంతు,వరిబీజము,బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ఓపి 160 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరము ఉన్న వారిని 42మందిని హాస్పిటల్కు రిపర్ చేశారు.వీరిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు.
ఈ వైద్య శిభిర కార్యక్రమంలో డాక్టర్లు నాగేంద్ర ప్రసాద్ ,అయేషా ఫాతిమా నర్స్ సుజాత, మార్కెటింగ్ వెంకటాద్రి, నాగార్జున, సురేష్ ఉప సర్పంచ్ సాగర్ వార్డు సభ్యులు జొన్నోజి నాగులు, నాయకులు చంద్రారెడ్డి, వంజరి అంజయ్య, జొన్నోజు అశోక్, రంగోల్ల బిక్షపతి, ఆశా వర్కర్ వనజ తదితరులు పాల్గొన్నారు.