ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ కు
మద్దతుగా నానావత్ శివాజీ నాయక్ ఎన్ ఎస్ యు ఐ
21 అక్టోబర్
మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ విద్యార్థి సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ యువతి యువకులు అందరూ ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్ఛారు.
ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్ మాట్లాడుతూ. మేడ్చల్ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ కి ప్రజలు, యువతి, యువకులు ఓట్లు వేసి గెలిపించుకోవాలని అన్నారు కష్టపడి పార్టీ కోసం ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ప్రజామనిషి తోటకూరి జంగయ్య కి గెలిపించుకోవడం కోసం నియోజకవర్గ ప్రజలు యువతి యువకులు అందరూ ఓట్లు వేసి మన సమస్య కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని తెలియజేశారు.
కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తా అన్న కెసిఆర్ సర్కార్ ఇప్పటివరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసి విద్య, వైద్యం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు.
నియోజవర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ గెలవాలి చెప్పారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సిహెచ్ మల్లారెడ్డి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చెయ్యలేదు కాబట్టి మల్లారెడ్డి ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తోటకూరి జంగయ్య కు ఓట్లు వేసి గెలిపించుకోవాలని విద్యార్థిని, విద్యార్థులకు, యువతి, యువకులకు,ప్రజలకు విజ్ఞప్తి చేసారు . మేడ్చల్ నియోజకవర్గం లో ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అంటే టిఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి తెలియజేశారు.
