సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ ఇషాంత్ ప్రేమ్ చరణ్ రాష్ట్రస్థాయి అండర్ 14 క్రికెట్ లో సెంచరీ తో ఆకట్టుకున్నాడు.పాండిచ్చేరితో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ రెండు రోజుల పాటు జరిగే మ్యాచ్ లో 142 బంతుల్లో101పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.అతని తండ్రి బాకీ స్వామి కూడా ఒక క్రికెటర్ కావడం జిల్లాకు ప్రాతినిత్యం వహించిన వాడు కావడం విశేషం. బాకీ స్వామి తన సొంత ఖర్చులతో తన వ్యవసాయ క్షేత్రంలో ఇషాంత్ ప్రేమ్ చరణ్ కి క్రికెట్లో శిక్షణ ఇస్తూ ఈ స్థాయికి తెచ్చినాడు. ఇషాంత్ ప్రేమ్ చరణ్ క్రికెట్లో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని గజ్వేల్ పట్టణవాసులు మరియు కోచ్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
