తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలైంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకురావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి పెద్దపల్లి జిల్లా చేరుకున్నారు.
ఎన్నికల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు చేరుకున్నారు.
బుధవారం సాయంత్రం వచ్చిన రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ములుగు జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.ఇవాళ ఈ యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది.
బుధవారం ములుగు జిల్లాల ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈరోజు ఉదయం మంథని నియోజకవర్గం కేంద్రంతోపాటు కమాన్‌పూర్ మండలాల్లో బస్సు యాత్ర జరగనుంది.
మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు, రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడతారని వెల్లడించాయి.
సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నేతలు ముస్తాబు చేస్తున్నారు.
