క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం
– జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి
–
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ప్రతి గ్రామపంచాయతీలో తెలంగాణ క్రీడా ప్రగతి ప్రాంగణం ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని ఆమె అన్నారు.
గురువారం సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్
మినీ స్టేడియలో రాజన్న ప్రీమియం లీగ్- 2023 పేరుతో ఈ నెల 9,10 తేదీలలో రెండు రోజులు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ జిందంకళా చక్రపాణి తో కలిసి ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.
గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు రాజన్న ప్రీమియర్ లీగ్- 2023 పేరుతో క్రీడా పోటీలను జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
క్రీడా పోటీల వల్ల గ్రామీణస్థాయి నుంచి మంచి క్రీడాకారులు పుట్టుకొస్తారన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన బోయే క్రీడాకారులకు సిఎం కేసిఆర్, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలోని 255 గ్రామపంచాయతీలలో తెలంగాణ క్రీడా ప్రగతి ప్రాంగణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందన్నారు.
మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రం సిరిసిల్లలో మినీ స్టేడియం ను ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం ను త్వరితగతన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కే ఉపేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
