Breaking News

గంభీరావుపేట లో ఘనంగా కాన్సీరాం వర్ధంతి వేడుకలు

102 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని ఆదివారం గంభీరావుపేట మండల అధ్యక్షుడు ఇరిగి పర్శరాములు ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలం లో తెలంగాణా స్తూపం వద్దబిఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ కాన్సీరాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా నాయకులు బందెలదేవరాజ్ సిరిసిల్ల నియోజక వర్గప్రధాన కార్యదర్శి యారపు రాజబాబునియోజకవర్గ మహిళా కన్వీనర్ మానపల్లి సుధా హాజరయ్యి కాన్సిరాం చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడంజరిగింది. వారు మాట్లాడుతూ, కాన్సిరాం అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం అనేక సార్లు చదివి అర్థం చేసుకొని ఎన్నో ఏండ్లుగా బహుజనులు అనిచివేతకు గురవుతున్నారని, అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డరని తెలుసుకోవడం జరిగిందని, అదె విదంగా ఈ దేశంలో బహుజనులె ఎక్కువ శాతం మంది ఉన్నకాని రాజ్యాధి కారానికి దూరంగా ఉన్నరని అది గ్రహించిన కాన్సిరాం బహుజనుల రాజ్యదికారమె లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించడం జరిగిందని అన్నారు.తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజనులందరి కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు కాన్సిరాం అని, సైకిల్ యాత్ర మొదలుపెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని అంబేద్కర్ గారి ఆశయాలను చదివినటువంటి కాన్సీరాం అదే బాటలో నడుస్తూ మహిళా అయినటువంటి మాయావతి గారిని ముఖ్యమంత్రి ని చేశారని, కాబట్టి బహుజనులందరం కలిసి కట్టుగా పనిచేసి బహుజన్ సమాజ్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు అందరం కలిసి పనిచెద్దం రండి అని పిలుపునిచ్చారు. అదే విధంగా మనరాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ ఎంతో త్యాగం చేసి బహుజనులందరి కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరి మహనీయుల యొక్క బాటలో నడుస్తూ రాజ్యాధికారమే లక్ష్యంగా అయన బహుజన రాజ్యాధికార యాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతటా పర్యటిస్తున్నరని, ఆయనకు మద్దతుగా మనమందరం కలిసి పనిచేసితెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరుతూ కార్యకార్తలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కరికె సతిష్, మండల ప్రధానకార్యదర్శి కొంగరి సతిష్, మండల కోశాధికారి రాఘవపురం  వేంకటేష్, సినియర్ నాయకులు దోసల ఉపెందర్, సెక్టార్ అధ్యక్షులు పేండ్యల బాలయ్య, సెక్టార్ ఉపాధ్యక్షుడు ఎగదేని రామస్వామి, మండల మహిళా కన్వీనర్ రాగపురం లక్ష్మి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Anugula Krishna