ప్రాంతీయం

రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డి

78 Views

దౌల్తాబాద్: రెడ్డి సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా పలుపునూరి ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అప్పమ్మగారి రాంరెడ్డి ఆదివారం గజ్వేల్ లో నియామక పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు రాంరెడ్డి , గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు వేలూరి కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . ముఖ్యంగా పేద రెడ్డి సామాజిక వర్గ అభ్యున్నతికి రెడ్డి జేఏసీ కృషి చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు వత్తిడి తెస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తామని తెలిపారు . త్వరలోనే రాష్ట్రస్థాయి సభ ఏర్పాటు చేసి రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చర్చించి సంఘటితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు .

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *