ప్రాంతీయం

మృతుల కుటుంబాలకు పరామర్శ 

89 Views
  • మృతుల కుటుంబాలకు పరామర్శ

పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం.

సిద్దిపేట జిల్లా జూన్ 21

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పెద్ద చేప్యాల గ్రామంలో ఇటివల అనారోగ్యంతో కర్రే లింగవ్వ మృతి చెందిన విషయం తెలుసుకొని మీరుదొడ్డి యం పి పి గజ్జెల సాయిలు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల రాజేశం ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందజేశారు.అదే గ్రామంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న గజ్జెల బాలరాజు కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసి , ఇరువురి కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు.ఈ సందర్భంగా గజ్జెల సాయిలు మాట్లాడుతూ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉంటూ ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం కోసం చర్యలు చేపడతామన్నారు. ఇరువురు కుటుంబాలకు బాసటగా ఉంటామన్నారు. బాలరాజు కు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి దాతలు చేయూత అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దెల రాజేశం, భూపాల్ అందె ప్రవీణ్ ,రాజిరెడ్డి, అడ్వకేట్ పల్లెటూరి ప్రసాద్,అమర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298