టి డబ్ల్యూ జె ఎఫ్ విమర్శ
ఇండ్ల స్ఠలాల కోసం పొరాటం కొనసాగిస్తామని హెచ్చరిక.
భారత రాష్ట్ర సమితి మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలపై చేర్చలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమీటీ విమర్శించింది.
ఏండ్ల తరబడి ఇండ్ల స్ఠలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులను బి ఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వ్యాఖ్యానించింది. చివరకు సుప్రీమ్ కోర్ట్ తీర్పుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గౌరవించలేదని అభిప్రాయపడింది. కల్లిబొల్లి కబుర్లు చెప్పి జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చెసింది.
పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టు సంఘాలు ఏండ్ల తరబడి పోరాటం చేస్తున్నా నిర్లక్షయంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. జర్నలిస్టుల ఇండ్ల స్ఠలాలకోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
