ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్12, బేడ బుడగజంగం నూతన కార్యవర్గం…అసెంబ్లీ, పార్లమెంటులో బుడగ జంగాలకు స్థానాలు కల్పించాలి. ప్రభుత్వ ఫలాలు బుడగ జంగాలకు అందాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడ బుడగ జంగం నూతన సంఘం ఏర్పాటు చేశారు. బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు చల్ల బాలరాజు మాట్లాడుతూ… సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడ బుడగ జంగాలు సంఘటితమై మొదటిసారిగా ఎల్లారెడ్డిపేట మండలంలో సంఘం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఇదేవిధంగా ప్రతి మండలంలో ఎల్లారెడ్డిపేటను స్ఫూర్తిగా తీసుకొని మండల కమిటీలు వేయాలని మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఐక్యంగా ఉండి పోరాడాలని బుడగజంగాలను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదని కనీసం వారు ఏకులానికి చెందినవారో తెలియని పరిస్థితి ఉందని ఇప్పుడిప్పుడే బుడగజంగాల్లో చైతన్యం పెరుగుతుందని బుడగజంగాలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రభుత్వం గుర్తించి బుడగ జంగాలకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో కూడా అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ఫలాలు బుడగ జంగాలకు కూడా అందాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలియజేశారు. నూతన సంఘం మండల అధ్యక్షులు విబుది హనుమంతు, ఉపాధ్యక్షులు కిష్టయ్య, పరశురాములు, కనకయ్య, కోశాధికారి పత్తిరి బాలకిషన్, ప్రధాన కార్యదర్శి మోతి తిరుపతి, ముఖ్య సలహాదారులు బొమ్మల మల్లేశం, మైసయ్య, కిరణ్, సంఘం సభ్యులు ఈబూతి రవీందర్, కడమంచి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
