జగదేవపూర్ : మండల కేంద్రము లో మాస్టర్ మైండ్ పాఠశాలలో…బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి.వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి అడిపాడారు.
అమ్మాయిల అటపాటలతో యువతుల దాండియా నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ అంటే ప్రకృతిని ప్రేమించే పండుగ అని అన్నారు.
ప్రకృతిని రక్షించుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాలు బాగుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో T,R,S,M,A ఉమ్మడి మెదక్ జిల్లా రాఘవేంద్ర రెడ్డి. ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్,
ఉపాద్యాయులు విద్యర్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
