ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్10, భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ శ్రీకృష్ణ యాదవ సంఘంలో న్యాక్ సెంటర్ లో లేబర్ కార్డు ఉన్నవారికి తాపీ మేస్త్రి కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ మొదటిది రెండవది శిక్షణ తరగతులు ముగిసాయి మూడవ శిక్షణ తరగతులు మొదలు కాపాడుతున్నాయి. శిక్షణ నేర్చుకునే వారు ఈనెల 16,17 తేదీలోగా లేబర్ కార్డు ఆధార్ కార్డ్ ఒకఫోటో న్యాక్ సెంటర్లో ఫామ్ ఫిల్ అప్ చేసుకొని దరఖాస్తు ఇవ్వగలరుని లేబర్ యూనియన్ అధ్యక్షులు తెలిపారు. ఈఅవకాశం మరల కావాలన్నా మన ముస్తాబాద్ లో నిర్వహించలేరు లేబర్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి ఇది చివరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మీరు మరల శిక్షణ తరగతులు తీసుకోవాలంటే సిరిసిల్లలో న్యాక్ సెంటర్ పెడతారు. సిరిసిల్లలో పోవడానికి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మన ముస్తాబాద్ లోనే శిక్షణ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు దయచేసి ఆలోచించి అర్థం చేసుకొని ఈశిక్షణ 15,రోజులే కానీ మన జీవితానికి టికెట్ ఎన్నో రకాల ప్రభుత్వ స్కీం లకు కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కీములకు ఈ భవానిర్మాణ రంగాలలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఈసర్టిఫికెట్ ఉంటే వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది 18 నుంచి 45 సంవత్సరాల వయసుగల వారు 1978 డిసెంబర్ లోపు పుట్టిన ప్రతి కార్మికుడికి ఈ అవకాశం ఉంది ఆలోచించి అర్థం చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలంగాణ భవన నిర్మాణ జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు గీసబిక్షపతి తెలిపారు.
