నేతాజీ ఆలోచన విధానంతో రెవిన్యూ డివిజన్ సాధిద్దాం
ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అంద బీరన్న
అక్టోబర్ 08
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో వున్నా అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కొరకు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆదివారం నాడు నేతాజీ ఆలోచన విధానంతో చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధిస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అందే బీరన్న అన్నారు.
ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ. స్వతంత్రం కోసం నేతాజీ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక దళం లాగా ఈనాడు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి జేఏసీ ఏర్పాటయిందని రెవిన్యూ డివిజన్ సాధించేంతవరకు నేతాజీ వారసుల లాగా ప్రాణత్యాగానికైనా వెనకాడభోమని ఆయన అన్నారు. టికెట్ల కోసం వెంపర్లాడే అధికార పార్టీ నాయకులు రెవెన్యూ డివిజన్ కోసం ఎందుకు వెంపర్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు, రెవిన్యూ డివిజన్ ఎన్నికల ముందు ప్రకటించకపోతే మిల్టెంట్ తరహా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ జనగామ జిల్లా అధ్యక్షులు పాకాల ఇసాక్, స్టూడెంట్ బ్లాక్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు,నాయకులు ఆత్మకూరు హరికృష్ణ, కొమ్ము ఎల్లయ్య, పొట్ట ఆనందం, రాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు
