ముస్తాబాద్, అక్టోబర్7, మండలంలోని గూడెం గ్రామానికి చెందిన లింగంపల్లి ఏళ్ళాగౌడ్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి 20 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాను నాకు పదవి ఇచ్చి గౌరవించినందుకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పార్టీని మరింత బలోపేతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు సడిమల బాలయ్య, కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గాంతరాజు, సీనియర్ నాయకులు వెల్ముల రామిరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, రామస్వామి పల్నాటి వెంకటి తదితరులు పాల్గొన్నారు.
