అర్జీలకు పరిష్కారం చూపాలి
-ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల, ఫిబ్రవరి 12, 2024:
ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
దివ్యాంగుడి వద్దకు వెళ్లి..
తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ సిరిసిల్ల లోని బీ వై నగర్ కు చెందిన దివ్యాంగుడు కస్తూరి పోశేట్టి ప్రజావాణి కి రాగా, కలెక్టర్ అతడి వద్దకు వెళ్లి దరఖాస్తు స్వీకరించారు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు 22, జిల్లా ఎస్పీకి 4, డీఎంఅండ్ హెచ్ఓ, డీఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 2 చొప్పున, వివిధ శాఖలకు కలిపి మొత్తం
41 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, వేములవాడ ఆర్డీఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
