అక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల్ ఎల్లేశ్వరం గ్రామంలో పర్యటించిన దుర్గం అశోక్ ప్రతి ఇంటికి వెల్లి ఊరిలో ఉన్న సమస్యల గురించి అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా రోడ్డు సౌకర్యం సరిగా లేక భీమారం వెళ్ళాలి అంటే 14, కిలో మీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి ఒస్తుందని దానితో చాల ఇబ్బంది పడుతున్నామని వర్చాకాలం వస్తే స్కూల్ పిల్లలు రైతులు వృద్దులు గర్భిణీ స్త్రీలకు ఇంకా చాల ఇబ్బంది ఔతుందని ఆరేపెల్లి రోడు అంకుషాపూర్ వద్ద నుండి షార్ట్ కట్ లో ఉన్న రోడ్డును వేసి వాగులో వంతెన నిర్మిస్తే ఇప్పుడు గంట ప్రయాణించే దూరాన్ని కేవలం పది నిమిషాల్లో చేరుతానని చెప్పడం జరిగింది.
అనంతరం దుర్గం అశోక్ మాట్లాడుతూ సరైన అభ్యర్ధిని ఎన్నుకుంటెనే సమస్యలు తీరుతాయని గ్రామస్థులకు ఓటు విలువ గురించి వివరిస్తూ నాఒక్క ఓటే కదా దీనితో ఏమోతుందని అనుకోకుండా పార్టీలను చూసి ఓటు వేయకుండా పోటీలో నిలబడిన అభ్యర్థులును చూసి ఇతను ఎమ్మెల్యే ఐతే కేవలం లీడర్లకు నాయకులకు పని చేసే ఎమ్మెల్యే ఎవరు,? మరి నిరుపేదలకు సామాన్యులకు అందుబాటులో ఉండి సేవ గుణం దానగుణం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరు? అని అన్నివిధాలుగా చర్చించి వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మంచి అభ్యర్ధి ఎవరని చూసి ఓటు వేయండి అని అవగాహణ కల్పించారు.
నేను కూడ ఎమ్మెల్యే గా పోటీలో ఉంటున్నాను , మీరు నాకే ఓటు వేయమని నేను చెప్పడం లేదు కాని చర్చించండి మళ్ళీ పార్టీలను చూసి నోటు కి కోటర్ కి కాకుండా బాబాసాహెబ్ అంబేధ్కర్ తన సర్వస్వాన్ని కోల్పోయి మనకు సాధించి ఇచ్చిన బ్రహ్మాస్త్రం దానిని వృదా చేయకుండా భావితరాల పిల్లల భవిష్యత్ కోసం ఎవరు సరైన అభ్యర్తో గుర్తించి ఓటు వేయండి అని తెల్పడం జరిగింది.
ఈకార్యక్రమంలో సల్లూరి రాజు, దుర్గం కపిల్ దేవ్,అమర్ సెగ్గెం రాజం, వేముల రమేశ్ గౌడ్, దుర్గా ప్రసాద్, సాయి, మాడెం శ్రీనివాస్ ,సురేందర్ ,ఆకుదారి ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
