రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం జగదాంబ తండా గ్రామంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ పెంచినందుకు జగదాంబ తండా గ్రామసర్పంచ్ బాల్య నాయక్ గ్రామ ప్రజలు అందరు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ మాట్లాడుతూ యావత్తు భారతదేశం గర్వించదగ్గ పనిచేశారని ఎవరు చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు పై శాతం రిజర్వేషన్ పెంచి చీరకాలంగా మా గుండెల్లో నిలిచిపోయారని రాబోవు తరాలకు మంచి భవిష్యత్తును ఇచ్చారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో జగదాంబ తండా సర్పంచ్ బాల్య నాయక్, ఉప సర్పంచ్ ఎంపిటిసి మరియు పాలకవర్గం ప్రభుత్వ ఉద్యోగులు యూత్ సభ్యులు విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని దాదాపు 5 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు.ఇంకా 20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు వేడుకున్నారు.