మర్కుక్ : చేబర్తి
*కంటి వెలుగుతో మసకబారిన కళ్ళకు వెలుగులు పంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*-
*మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి చూపు మస్కబారిన బాధితులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు హాజరై స్థానిక సర్పంచ్ అశోక్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ లతో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ప్రత్యేకించి వృద్దులు నా పెద్ద కొడుకు కెసిఆర్ మా కోసం కంటి వెలుగు కార్యక్రమంతో మసకబారిన మా కళ్ళకు వెలుగులు ప్రసాదించాడని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం బిపాషా యువజన అధ్యక్షులు గణేష్ పుర ప్రముఖులు పాల్గొన్నారు




