గజ్వేల్: అక్టోబర్ 3
24/7 తెలుగు న్యూస్
మంత్రి హరీష్ రావు గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సీఎం కెసిఆర్ కి ఏకగ్రీవ తీర్మానం చేసిన వివిధ వైశ్య సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన వైశ్య సంఘ ప్రతినిధులు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడం మనమందరం చేసుకున్న అదృష్టం,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టే ఈ రోజు గజ్వేల్ ఇంత అభివృద్ధిలో ముందుకు సాగుతుంది అన్నారు.
